

దేశవ్యాప్త గిగ్ వర్కర్ల సమ్మె నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి సంస్థలు డెలివరీ ఏజెంట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ఏడాది చివరి రోజు కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాలను పెంచాయి.
డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య పనిచేసే వర్కర్లకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120–150 వరకు చెల్లిస్తామని జొమాటో తెలిపింది. ఈ సమయంలో వర్కర్లు సగటున రూ.3,000 వరకు సంపాదించవచ్చని పేర్కొంది. స్విగ్గీ కూడా ఇదే తరహా ఆఫర్లు ప్రకటిస్తూ, డిసెంబర్ 31 మరియు జనవరి 1న పీక్ అవర్స్‌లో ఒక్కొక్కరూ గరిష్ఠంగా రూ.2,000 వరకు సంపాదించవచ్చని తెలిపింది. జెప్టో కూడా ప్రోత్సాహకాలు పెంచినట్లు సమాచారం.
డిసెంబర్ 25 న జరిగిన సమ్మె తరువాత, డిసెంబర్ 31న కూడా గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె వల్ల స్విగ్గీ, జొమాటో, జెప్టో, అమెజాన్ వంటి సేవలపై ప్రభావం పడింది. మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత వంటి డిమాండ్లతో పాటు 10 నిమిషాల డెలివరీని రద్దు చేయాలని యూనియన్లు కోరుతున్నాయి.








.png&w=3840&q=75)









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!