

భారత్ మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తన తాజా సోషల్ మీడియా చర్యలతో మరోసారి ఆసక్తి రేకెత్తించింది. ఆదివారం ఆమె పెళ్లి అర్ధాంతరంగా వాయిదా పడిన కొన్ని గంటల్లోనే, సోమవారం ఉదయం స్మృతి తన ఎంగేజ్మెంట్, ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్టులను ఒక్కసారిగా డిలీట్ చేసింది. తన వరుడు పలాశ్ ముచ్చల్ చేసిన ప్రేమప్రకటనా వీడియోను కూడా తీసేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆశ్చర్యకరంగా, ఆమె సహచర ఆటగాళ్లు జెమిమాహ్ రోడ్రిగ్స్, శ్రేయంక పటిల్ కూడా స్మృతి పెళ్లి ప్రకటనకు సంబంధించిన వీడియోలను తీసేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అకస్మిక చర్య మీడియా మరియు అభిమానుల్లో చర్చను ప్రారంభించింది. అయితే స్మృతి తన పాత ఫోటోలు, ప్రత్యేకంగా పలాష్ తో ఉన్నవి మాత్రం అలాగే ఉంచడం మరింత సందేహాలకు కారణమైంది.
మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలో ఆదివారం జరగాల్సిన స్మృతి–పలాశ్ పెళ్లి, ఆమె తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో వెంటనే వాయిదా పడింది. అదే రోజు కొన్ని గంటల్లోనే పలాశ్ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం జరిగింది. తక్షణ చికిత్సతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ పరిణామాలు జరుగిన తర్వాత స్మృతి పెళ్లి పోస్టులు తొలగించడం చూసి, ఆమెకు అది అననుకూలంగా అనిపించిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే చర్చలు కొనసాగుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!