

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడుల్లో భాగంగా కేరళ మరియు బెంగళూరు ప్రాంతాల్లో ఆరుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మొత్తం రూ.16.20 కోట్ల విలువైన సైబర్ మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితులు డిజిటల్ అరెస్ట్లు, ఆన్లైన్ ట్రేడింగ్, కొరియర్ సేవల పేరుతో ప్రజలను మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి లేదా అధిక లాభాల ఆశ చూపి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ మొత్తాన్ని మ్యూల్ అకౌంట్ల ద్వారా విదేశాలకు తరలించినట్లు ఆధారాలు లభించాయి.
ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్న పోలీసులు, ఈ నేరాలకు పాల్పడిన ప్రధాన సైబర్ నేరగాళ్లు ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. ప్రజలు ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులపై స్పందించవద్దని హెచ్చరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!