

ఐబొమ్మ రవి కేసులో మరోమారు పెద్ద షాకింగ్ విషయాలను హైదరాబాదు సీపీ సజ్జనార్ వెల్లడించారు. రవి మొత్తం 110 డొమైన్లు కొనుగోలు చేసి, వాటిలో సుమారు 21 వేల సినిమాలను అప్లోడ్ చేసినట్లు ఆయన తెలిపారు. పైరసీ నెట్‌వర్క్‌ను దాచిపెట్టడానికి రవి విదేశీ మార్గాలను కూడా ఉపయోగించినట్లు చెప్పారు.
సజ్జనార్ మాట్లాడుతూ, రవి కరీబియన్ దీవుల్లోని సెయింట్ నేవీ దేశపు పౌరసత్వం కూడా పొందినట్టు వెల్లడించారు. అదనంగా, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్‌లలో ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలిపారు.
ఐబొమ్మ ప్లాట్‌ఫామ్ ద్వారా వన్ విన్, వన్ ఎక్స్ లాంటి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడని, అలాగే APK ఫైల్స్ పేరుతో ప్రజల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ చొప్పించే ప్రయత్నాలు చేశాడని సీపీ వివరించారు. మొత్తం మీద రవి డిజిటల్ క్రైమ్ నెట్వర్క్ పరిమాణం ఊహించని స్థాయిలో ఉందని సజ్జనార్ పేర్కొన్నారు.









.jpeg&w=3840&q=75)

.webp&w=3840&q=75)





.webp&w=3840&q=75)


కామెంట్స్ (1)
Strict action is needed against such digital crimes.