
బిజినెస్

లోక్ భవన్లో తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్ల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.









.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!