

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. భజరంగి క్రియేషన్స్ మరియు ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా కడప నేపథ్యంగా సాగే ఈ సినిమా సరికొత్త ప్రేమ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది.
ఏపీ04 రామాపురం సినిమాతో మంచి గుర్తింపు పొందిన దర్శకుడు యు హేమారెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో కేశవ కాలవపల్లి హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీతాన్ని వినోద్ వైలా అందిస్తున్నారు. హీరో పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని కూడా వెల్లడించింది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!