

ఈ వారం బ్యాండు మేళం, లేచింది మహిళా లోకం, ప్రతిఛాయ, మెన్షన్ హౌస్ మల్లేష్, హ్యాపీ రాజ్ వంటి సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వీటితో పాటు మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఆ సినిమా లగ్గం టైమ్. ఇందులో రాజేష్ మేరు, నవ్య చిట్యాల ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. కానీ పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా తెలియకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండున్నర నెలల తర్వాత ఆహా వేదికలో అందుబాటులోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే అనన్య పెళ్లి రోజున ఆమె ప్రియుడు సూర్య ఆమెను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కానీ అనుకోని సంఘటనతో పరిస్థితులు మారిపోతాయి. అదే సమయంలో పెళ్లికొడుకు చంద్ర అపహరణకు గురవుతాడు. ఈ కేసులో సూర్యపై అనుమానం పడుతుంది. అసలు అపహరణ చేసినది ఎవరు, వారి ప్రేమకథ ఎలా ముగిసింది అనేది సినిమా కథ.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!