

బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు జాగృతిలో చేరారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాపూరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని, కవిత ఇచ్చిన ప్రోత్సాహంతోనే తన ప్రయాణం కొనసాగిందని చెప్పారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మూడోసారి టికెట్ ఇవ్వలేదని, కాంగ్రెస్‌లో చేరినా తగిన ప్రాధాన్యత దక్కలేదని తెలిపారు.
కవిత నాయకత్వంలో కొత్త రాజకీయ వేదికలో పనిచేస్తానని, ఇచ్చోడలో భారీ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను కలుపుకుంటానని బాపూరావు పేర్కొన్నారు. కవిత మాట్లాడుతూ అనేక జిల్లాల నుంచి నాయకులు కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారంతా మళ్లీ ఏకం కావాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!