బహ్రెయిన్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చిక్కుకున్న 59 మంది తెలుగు పౌరులు ఈ రోజు రాత్రి సురక్షితంగా సౌదీకి బయలుదేరారు. సౌదీ అరేబియా డమ్మాం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో పయనించిన వీరికి ఏపీఎన్ఆర్టి (APNRT) మరియు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుల సంయుక్త సహకారం అందింది. గత 10 రోజులుగా బహ్రెయిన్‌తో పాటు వివిధ గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకున్న వీరి రక్షణ, రవాణా కోసం స్థానికంగా ఏర్పాట్లు చేశారు. సౌదీలోని విమానాల రాకపోకలు యుద్ధ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా నిలిచినప్పటికీ, ఇప్పుడు పాక్షికంగా పునఃప్రారంభం అయ్యాయి.
చిక్కుకున్న వారి పరిస్థితిని బహ్రెయిన్‌లోని ఏపీ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRTS) మరియు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం గుర్తించగా, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి సహాయం కోరారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎన్ఆర్టి చైర్మన్ వేమూరి రవికుమార్, సీఈఓ కృష్ణమోహన్ అధికారులు రంగంలోకి దిగి, గుడ్ విల్ రాయబారులను అప్రమత్తం చేశారు.
గల్ఫ్ కౌన్సిల్ లో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సుమారు 100 మంది ఏపీఎన్ఆర్టి గుడ్ విల్ రాయబారులు సక్రియంగా పనిచేశారు. వారు ట్రాన్జిట్ వీసాలు, స్థానిక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి, విమానాశ్రయానికి చేరుకోవడానికి వ్యక్తిగత వాహనాలు మరియు ఇతర లాజిస్టిక్ సపోర్ట్ అందించారు. తెలుగు పౌరులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టి టీమ్, ఏపీ ప్రభుత్వం, భారత రాయబారులు మరియు బహ్రెయిన్, సౌదీకి చెందిన ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!