

ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు రెండు దేశాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) తన తాజా నివేదికలో వెల్లడించింది.
నివేదిక ప్రకారం, ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో రష్యాకు కనీసం 12 లక్షల మంది నష్టం వాటిల్లింది. ఇందులో 3,25,000 మంది రష్యా సైనికులు ఉన్నారు. తక్కువ సైన్యంతోనే రష్యాతో పోరాడిన ఉక్రెయిన్ బలగాల్లో సుమారు 1,40,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.
అదే విధంగా, తీవ్రంగా గాయపడటం, గల్లంతు కావడం, లేదా శత్రు సైన్యానికి చిక్కి బందీలుగా రష్యాకు బలవంతంగా తరలింపబడినవారి సంఖ్య 6 లక్షలకు పైగా ఉందని నివేదిక తెలిపింది. కొద్దిపాటి భూభాగం మరియు విలువైన ఖనిజ వనరులపై ఆధిపత్యం కోసం రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటోందని CSIS పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా వంటి అగ్రరాజ్యం ఇంతటి ప్రాణనష్టాన్ని ఎదుర్కోవడం చరిత్రలో ఇదే తొలిసారి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!