

తెలంగాణలో మరోసారి ఆర్టీసీ బస్సు ప్రమాదం సంభవించింది. ఇటీవలే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం విషాదం మరిచిపోకముందే, సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారి 65 సమీపంలోని ముత్తంగి వద్ద మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. సమాచారం ప్రకారం, ముందు వెళ్తున్న కారును తప్పించే ప్రయత్నంలో బస్సు బ్రేక్‌లు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. ఫలితంగా బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తున్న మార్గంలో చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పటాన్చెరువు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సులకు వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.















కామెంట్స్ (1)
Glad everyone is safe!