

దేశ భవిష్యత్తుగా భావించే యువతపై తాజా గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ లో 2025 సంవత్సరంలో మొత్తం 42,566 మంది జైలుకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో అత్యధికంగా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల యువతే ఉండటం గమనార్హం. ముఖ్యంగా 1997 తర్వాత జన్మించిన Gen Z వర్గానికి చెందిన వారే ఈ సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. ఒక్క 2025లోనే 19,413 మంది యువకులు జైలుకు వెళ్లినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, జైలుకు వెళ్లిన వారిలో 40,090 మంది తొలిసారి నేరాలకు పాల్పడ్డవారేనని అధికారులు చెబుతున్నారు. నేరాల రకాలను పరిశీలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2,833 (152% పెరుగుదల), సైబర్ క్రైమ్ కేసులు 1,784 (135% పెరుగుదల), పోక్సో కేసులు 4,176, డ్రగ్స్ (NDPS) కేసులు 7,040, హత్య కేసులు 3,260గా నమోదయ్యాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, సైబర్ నేరాలు వేగంగా పెరుగుతుండటం ప్రమాదకర సంకేతంగా మారింది.
ఇది కేవలం తెలంగాణకే పరిమితమైన సమస్య కాకుండా, ఆధునిక సమాజంలో యువత ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే నైతిక హెచ్చరికగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెరుగైన పౌర బాధ్యత, చట్టాలపై అవగాహన, స్వీయ నియంత్రణ అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యువత దారి తప్పకుండా సమాజం మొత్తం కలిసి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!