
టెక్నాలజీ

చలి పంజా.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సిద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలోని జి. మాడుగులలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలుగా నమోదైంది. చాలా జిల్లాల్లో 20–25 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతున్నాయి. మరోవైపు, వచ్చే వారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!