
సినిమాలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్ కొత్త రికార్డును సృష్టించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏకంగా 90,954 మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చి టోర్నమెంట్లో ఇప్పటివరకు అత్యధిక ప్రేక్షకుల హాజరుగా నిలిచింది. రెండు బలమైన జట్ల మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరుకు అభిమానుల ఉత్సాహం స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించింది.

ఈ మ్యాచ్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐసీసీ చైర్మన్ జై షా, భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ వంటి ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన ఈ వేదిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు మద్దతుగా అభిమానులు నీలిరంగుతో స్టేడియాన్ని నింపేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!