
న్యూస్

జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని చారిత్రక రఘునాథ ఆలయంలో 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక హిందువులు, ముస్లింలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన హిందువులు, కశ్మీరీ పండిట్లు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతుండగా, విగ్రహ ప్రతిష్ఠ ఇంకా జరగలేదు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్ల పునరాగమనం కోసం ముస్లింల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్థానిక ముస్లింలు కూడా హిందువులతో తమ సోదర భావాన్ని వ్యక్తం చేస్తూ, శతాబ్దాలుగా కలిసి జీవిస్తున్నామని తెలిపారు. గతంలో జీలం నది తీరంలో కలిసి జరుపుకున్న పండుగలను గుర్తుచేసుకుని పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!