
.webp&w=3840&q=75)
దేశ రవాణాకు ఆయువుపట్టులాంటి భారతీయ రైల్వేకు కేంద్ర బడ్జెట్ 2026–27లో భారీ నిధులు కేటాయించారు. మూలధన వ్యయాల కోసం రూ.2,77,830 కోట్లను ప్రత్యేకించగా, ఇది గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే సుమారు 10.25 శాతం అధికం. అదనంగా బడ్జెట్‌కు బయటి వనరుల ద్వారా మరో రూ.15వేల కోట్లు సమకూరనున్నట్లు కేంద్రం తెలిపింది.
బడ్జెట్ వివరాల ప్రకారం కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.36,721.55 కోట్లు, గేజ్ మార్పిడికి రూ.4,600 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ.37,750 కోట్లు కేటాయించారు. లోకోమోటివ్స్, వాగన్లు, కోచ్‌లు వంటి రోలింగ్ స్టాక్‌కు రూ.52,108.73 కోట్లు, సిగ్నలింగ్–టెలికాం వ్యవస్థలకు (కవచ్ భద్రతా వ్యవస్థతో సహా) రూ.7,500 కోట్లు కేటాయించారు. 2026–27లో రైల్వే ఆదాయం రూ.3,85,733.33 కోట్లుగా అంచనా వేయగా, ఖర్చు రూ.3,82,186.01 కోట్లుగా ఉండనుందని పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందిందని తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం రూ.20వేల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించడంతో పాటు, దాదాపు 4,000 కిలోమీటర్ల పొడవున ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!