
క్రీడలు

తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈ నెల 12 లేదా 13న విడుదలయ్యే అవకాశం ఉంది. శనివారం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో సుమారు 1.05 లక్షల మంది ఒక్క సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయేమోనని జవాబుపత్రాలను మరోసారి పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఇక జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, అల్పాహారం పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం సిలబస్లో మార్పులు చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ద్వారా రేవంత్ రెడ్డి విడుదల చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!