

గ్రేటర్ హైదరాబాద్‌కు ముఖ్యమైన జలవనరుగా ఉన్న శామీర్‌పేట పెద్ద చెరువు ప్రస్తుతం తీవ్రమైన కాలుష్య ముప్పును ఎదుర్కొంటోంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఆనుకొని ఉన్న కొన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థల నుంచి వెలువడుతున్న మురుగునీరు, వ్యర్థాలను నేరుగా చెరువులోకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఎంఆర్ ఫంక్షన్ హాల్, పిస్తా హౌజ్‌తో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన హోటళ్లు, కేఫ్, వినోద కేంద్రాల నుంచి వచ్చే మురుగునీటికి సరైన శుద్ధి లేదా నిల్వ వ్యవస్థ లేకపోవడం వల్ల చెరువు నీటి నాణ్యత తీవ్రంగా పడిపోతున్నదని చెబుతున్నారు.
అదేవిధంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలు జరిగాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు ఫిర్యాదులు వెళ్లినా రాజకీయ ప్రభావంతో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే నల్సార్ విశ్వవిద్యాలయం పరిసరాలతో పాటు సమీప భవనాల నుంచి కూడా డ్రైనేజీ చెరువులోకి చేరుతోందని వాపోతున్నారు. వెంటనే వ్యర్థాల ప్రవాహాన్ని అడ్డుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన శామీర్‌పేట పెద్ద చెరువు పూర్తిగా మురికికూపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.





.jpeg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!