
.png&w=3840&q=75)
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాల పేర్లను మార్చే భాగంగా, కొన్ని కీలక సంస్థల పేర్లను అధికారికంగా మార్చింది. ఇప్పటివరకు రాజ్ భవన్ గా పిలిచే గవర్నర్ల అధికారిక నివాసాలు, అలాగే రాజ్ నివాస్ అని ఉండే నిర్మాణాలు… ఇకపై లోక్ భవన్ మరియు లోక్ నివాస్ గా పిలవబడతాయి. ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చాయి.
అలాగే, ప్రధాని కార్యాలయం (PMO) పేరును కూడా మార్చేశారు. ఇకపై దాన్ని సేవా తీర్థ్ అని పిలుస్తారు. ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్‌లో ఉన్న కొత్త PMO సముదాయం ఇప్పుడు ‘సేవా తీర్థ్-1’ నుంచి పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మూడు ఆధునిక భవనాలు నిర్మించారు. ఇక పరిపాలనలో మరో కీలక మార్పుగా, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం అయిన సెంట్రల్ సెక్రటేరియట్ పేరును కర్తవ్య భవన్ గా మార్చారు. ఇది కొత్తగా నిర్మించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ తొలి భవనం ప్రారంభానికి అనుగుణంగా చేపట్టిన మార్పు. భవిష్యత్తులో పలు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఒకేచోట నుంచే పనిచేయడానికి ఇది ఉపయోగపడనుంది.
“రాజ్” (రాజరికం) వంటి వలస పాలన కాలపు పదాలను తొలగించడం ద్వారా ప్రజా పాలనను మరింత ప్రజలకే దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ పేర్ల మార్పు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. కొత్త పేర్లు పబ్లిక్ సర్వీస్, బాధ్యత మరియు అందుబాటు వంటి భావాలను ప్రతిబింబిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!