

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారాస నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరుకావాలని సిట్ సూచించింది. ఈ కేసుకు సంబంధించి ఆయనకు పలు విషయాలపై అవగాహన ఉండొచ్చని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే కేసులో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారించిన సంగతి తెలిసిందే.
సిట్ నోటీసులపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసలు బాధ్యులైన అధికారులను వదిలేసి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ కక్షసాధింపేనని విమర్శించారు. గతంలో తనను, హరీశ్‌రావును విచారించినా ఏమీ రాలేదని, ఇప్పుడు సంతోష్‌రావును టార్గెట్ చేశారని ఆరోపించారు. మరోవైపు సంతోష్‌రావు స్పందిస్తూ, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరై పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. సిట్ దర్యాప్తు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!