
గాసిప్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవరి 3న తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న ధర్మశాల పనులకు ఆయన భూమిపూజ చేయనున్నారు. ఈ ధర్మశాల నిర్మాణానికి టీటీడీ రూ.35.19 కోట్ల నిధులు కేటాయించింది.
భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో, ఈ ప్రాజెక్టులో భాగంగా 100 గదులతో కూడిన భారీ సత్రంను నిర్మించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ధర్మశాల పూర్తయితే కొండగట్టు వచ్చే భక్తులకు పెద్ద ఊరటగా మారనుంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!