
క్రీడలు

ఈ నెల 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026 - 27 ప్రారంభమై, ఉద్యోగుల పన్నుల విషయంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానం ప్రకారం కంపెనీలు టీడీఎస్ కోత విధిస్తాయి. పాత విధానం కొనసాగించాలని భావిస్తే ఉద్యోగులు ముందుగానే కంపెనీకి తెలియజేయాలి. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేలకు పెంచడం వల్ల పన్ను భారం కొంత తగ్గే అవకాశం ఉంది.
కొత్త పన్ను విధానం ప్రకారం వార్షిక ఆదాయం రూ.12 లక్షల లోపు ఉన్న వారికి ఆదాయపు పన్ను ఉండదు. అయితే పాత విధానంలో అలవెన్సులు, మినహాయింపులు ఉపయోగించుకుంటే పన్ను భారం తగ్గించుకోవచ్చు. చైల్డ్ ఎడ్యుకేషన్, హాస్టల్ అలవెన్సులు పెరగడం ద్వారా ఉద్యోగులకు లాభం కలగనుంది. వ్యక్తిగత ఆదాయం, పెట్టుబడులు, మినహాయింపుల ఆధారంగా సరైన పన్ను విధానం ఎంచుకోవడం ద్వారా టేక్ హోమ్ శాలరీను మెరుగుపరుచుకోవచ్చు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!