
న్యూస్

హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, నగరంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రను సక్రమంగా నిర్వహించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఘన శోభాయాత్ర రేపు ఉదయం 11:30కి గౌలిగూడ నుండి ప్రారంభమై, తాడ్బండ్ ఆలయం వరకు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కొనసాగనుంది.
యాత్రను విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు మరియు యాత్ర నిర్వాహకులతో కలిసి సమన్వయ సమావేశాలు నిర్వహించి, కీలక సూచనలను అందించారు. శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ పరిమితులు అమలు చేయడం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా భద్రతా చర్యలు తీసుకోవడం వంటి ఏర్పాట్లు చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!