

ఒంటిమిట్టలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఆలయ పండితులు సీఎం దంపతులకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం జై శ్రీరామ్ నినాదాలతో సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ధర్మాన్ని అనుసరించి ధర్మపాలన అందిస్తామని చంద్రబాబు తెలిపారు. రాముడి పేరు వినగానే సుపరిపాలన గుర్తుకు వస్తుందని, రాష్ట్రంలో కూడా అలాంటి పాలన అందించడమే లక్ష్యమన్నారు. రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సంతోషం, ఆరోగ్యం కలగాలని శ్రీరాముణ్ని ప్రార్థించినట్లు చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరామనవమి జరుపుకునేవారమని, విభజన తర్వాత ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేసి ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే అమరావతి రాజధానిగా లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రామరాజ్యం లాంటి సుపరిపాలనను అందించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.





.jpg&w=3840&q=75)
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!