
సినిమాలు

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం వృథాగా పోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు వైఫల్యానికి ప్రణాళిక మరియు రూపకల్పనలో ఉన్న లోపాలే ప్రధాన కారణమని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి, ప్రాజెక్టులోని లోపాలను కేంద్ర బృందం పరిశీలిస్తున్నదని చెప్పారు. ఈ అధ్యయనం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించనున్నట్లు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!