

స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్‌ను పక్కనపెట్టి 2028 ఒలింపిక్స్‌లో పోటీపడతానని ప్రకటించిన నేపథ్యంలో, తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ఆసియా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు ముందు జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె, నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా తిరిగి రావాలని ఆశిస్తున్నానని తెలిపింది. ఏప్రిల్ 30 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఉన్నప్పటికీ, నమోదు చేయడానికి ప్రయత్నిస్తే గడువు ముగిసిందని సందేశం వస్తోందని పేర్కొంది.
తాను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని వినేశ్ ఆరోపించింది. ఫెడరేషన్ కప్‌లో పాల్గొనడానికి ప్రయత్నించగా, చివరి నిమిషంలో ఎంపిక ప్రమాణాలు మార్చడంతో అవకాశం కోల్పోయానని తెలిపింది. ఈ పరిణామాలు తనను కీలక పోటీల నుంచి దూరం పెట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. అయితే డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, రిజిస్ట్రేషన్ సమస్యలు చాలామందికి వచ్చినప్పటికీ అధికారులు సహాయంతో పరిష్కరించుకున్నారని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!