
న్యూస్

నేడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఘనంగా ప్రారంభమైంది. భారత దేశ సాయుధ దళాల సర్వసేనాధిపతిగా ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సమీక్షను నిర్వహిస్తూ వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళం సహా అనేక దేశాల నౌకలు పాల్గొని సముద్ర భద్రతా సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నాయి.
మొత్తం 70కి పైగా స్వదేశీ, విదేశీ యుద్ధనౌకలు ఈ వేడుకల్లో భాగమవుతుండగా, అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలతో కూడిన విమాన వాహక నౌక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తదితరులు హాజరవుతుండగా, ఈ నెల 25 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనలు, నౌకాదళ విన్యాసాలు కొనసాగనున్నాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!