
టెక్నాలజీ

ఈ నెల 7 న దేశవ్యాప్తంగా రైడ్-హైలింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలుస్తోంది. ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు చెందిన డ్రైవర్లు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరు గంటల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెకు పలు గిగ్ వర్కర్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి.
కనీస చార్జీలను ప్రభుత్వం నిర్ణయించాలి, యాప్ ఆధారిత రవాణా సేవలపై కఠిన నియంత్రణలు అమలు చేయాలనే డిమాండ్లతో డ్రైవర్లు నిరసనకు దిగుతున్నారు. యాదృచ్ఛిక ధరల విధానం, పెరుగుతున్న ఖర్చులు, సంస్థల దోపిడీ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!