

కొన్ని సినిమాల్లో హీరోతో పాటు ఇతర పాత్రలు కూడా మంచి పేరు తెచ్చుకుంటాయి. అలాంటి సినిమా ‘ధురంధర్’. ఇందులో హీరోగా రణ్‌వీర్ సింగ్ నటించగా, అన్ని పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విలన్‌గా అక్షయ్ ఖన్నా చేసిన రెహ్మాన్ డకైత్ పాత్ర చాలా హైలైట్ అయింది. అతని నటన, స్టైల్, డ్యాన్స్ అన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కానీ ఈ పాత్రను మొదటగా కొంతమంది నటులకు ఆఫర్ చేయగా, ముగ్గురు యాక్టర్లు తిరస్కరించారని కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చాబ్రా చెప్పారు. అందులో ఒకరు దక్షిణాది నటుడు, మరో ఇద్దరు బాలీవుడ్ నటులు. సినిమాలో చాలా మంది నటులు ఉండటం, ఇది ఎక్కువగా రణ్‌వీర్ సింగ్ సినిమా అని భావించి వారు ఈ ఆఫర్‌ను వదిలేశారని తెలిపారు.
ఆ నటుల పేర్లు చెప్పలేనని ముకేశ్ చాబ్రా అన్నారు. కానీ ఇప్పుడు వారు ఆ నిర్ణయంపై బాధపడే అవకాశం ఉందని చెప్పారు. మొదట అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా ఈ పాత్ర గురించి కొంత ఆలోచించారు. అయితే ఆర్. మాధవన్ మాత్రం వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయి ₹1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీని కొనసాగింపు ‘ధురంధర్: ది రివెంజ్’ కూడా ₹1500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇంకా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!