

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరంలో కల్తీ పాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవడం, మరణాలు చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చౌడేశ్వరి నగర్లో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై వివరాలు తెలుసుకుని బాధితులకు అందుతున్న వైద్యసాయం గురించి అధికారులు సీఎంకు వివరించారు. పరిసర ప్రాంతాల్లో పాల విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. పాలు వినియోగించిన కుటుంబాల్లో 75 మంది నుంచి నమూనాలు సేకరించగా, మిగిలిన వారి నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపగా, ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరీక్ష ఫలితాల అనంతరం పాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, ఫుడ్ సేఫ్టీ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!