
బిజినెస్

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ క్వలిబాఫ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకుంది. భద్రత, రాజకీయ, సైనిక, ఆర్థిక మరియు న్యాయ విభాగాల ప్రతినిధులతో కూడిన ఈ బృందం కీలక చర్చల కోసం అక్కడికి వెళ్లింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇతర పక్షం అంగీకరిస్తేనే చర్చలు ప్రారంభమవుతాయని సమాచారం.
ఈ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నాసర్ హేమతి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ తన షరతుల మేరకు ఒప్పందం జరగాలని స్పష్టం చేసింది. ఒప్పందం కుదరకపోతే మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!