
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో, అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ్ సాహాపై బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. మెస్సీ షెడ్యూల్‌కు ముందే స్టేడియాన్ని విడిచిపెట్టడంతో అభిమానులు ఆగ్రహానికి గురై విధ్వంసానికి పాల్పడగా, ఈ ఘటనపై సాహా గంగూలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెస్సీ ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తాతో గంగూలీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, మధ్యవర్తిగా వ్యవహరించాడని సాహా ఆరోపించాడు.
ఈ వ్యాఖ్యలను గంగూలీ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై బహిరంగంగా ఆరోపణలు చేయడం తన ప్రతిష్ఠకు భంగం కలిగించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మెస్సీ ఈవెంట్‌కు అతిథిగా మాత్రమే హాజరయ్యానని, కార్యక్రమంతో తనకు అధికారికంగా లేదా వ్యాపారపరంగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈవెంట్లో గందరగోళం నెలకొన్న సమయంలో తాను నిరాశతో స్టేడియాన్ని విడిచిపెట్టినట్లు కూడా గంగూలీ వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!