

హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్పోర్ట్ మరోసారి అతి పెద్ద విమానాల ప్రదర్శనకు వేదికగా మారుతోంది. “ వింగ్స్ ఇండియా 2026 ” పేరుతో నిర్వహిస్తున్న ఈ మెగా విమానాల ప్రదర్శన ఈరోజు ప్రారంభమై 31 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. దేశీ, విదేశీ విమాన తయారీ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొని తమ తాజా విమానాలు, హెలికాప్టర్లు, ఆధునిక సాంకేతిక ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
ఈ ప్రదర్శనలో భాగంగా నాలుగు రోజుల్లో మొత్తం 13 సార్లు గగనతల విన్యాసాలు జరగనున్నాయి. సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్‌తో పాటు మార్క్ జాఫ్రీస్ టీమ్ అద్భుతమైన ఎయిర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈరోజు ప్రత్యేకంగా మార్క్ జాఫ్రీస్ టీమ్ నిర్వహించే డ్రోన్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే పలువురు విమానాలు, హెలికాప్టర్లు బేగంపేట రన్‌వేపైకి చేరగా, చివరి రెండు రోజులు సామాన్య ప్రజలకు ప్రవేశం పరిమితం చేయనున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!