
గాసిప్స్
%20(1).png&w=3840&q=75)
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం లో జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తూ, 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రద్దీని బట్టి అవసరమైతే మరిన్ని సర్వీసులు కూడా పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జాతర ముఖ్య తేదీలు:
జనవరి 28: కన్నెపల్లి నుంచి గద్దెకు సారలమ్మ ఆగమనం.
జనవరి 29: చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోవడం.
జనవరి 30: భక్తుల మొక్కులు, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పణ.
జనవరి 31: దేవతల వనప్రవేశంతో జాతర ముగింపు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!