

నటి జాన్వీ కపూర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాపై వచ్చిన ఓ రివ్యూ పోస్ట్‌ను జాన్వీ లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ రివ్యూలో జాన్వీ పాత్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శిస్తూ “భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకు జరిగిన అతిపెద్ద అన్యాయం” అని పేర్కొన్నారు. ఈ లైక్‌పై అభిమానుల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఆమె తన పాత్రపై అసంతృప్తిని పరోక్షంగా తెలిపిందని అంటుంటే, మరికొందరు పొరపాటున జరిగిందని భావిస్తున్నారు. తర్వాత జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేసినప్పటికీ అప్పటికే స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించింది. సినిమా తొలి రోజు రూ.135 కోట్లు వసూలు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!