
జనరల్

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియర్ కాంగ్రెస్ నేత, మంత్రి రామలింగా రెడ్డి తనకు కావలసిన బెంగళూరు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ దక్కకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆయన కోరుకున్న శాఖకు బదులుగా ఇరిగేషన్ శాఖను కేటాయించడంతో అసంతృప్తికి గురైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తనను పదేపదే అవమానించారని రామలింగా రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించినట్లు సమాచారం. కేబినెట్ ఏర్పాటు జరిగిన రెండురోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు నిదర్శనంగా మారింది. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!