

ఆంధ్రప్రదేశ్ ఎన్‌డీఏ కూటమిలో రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని కూటమి నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కోరినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాజా చర్చల ప్రకారం తెలుగుదేశం పార్టీకి మూడు సీట్లు, జనసేన పార్టీకి ఒక సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ, ఆ సీటు చివరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే దక్కే అవకాశం ఉందన్న చర్చలు పార్టీ వర్గాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, కిలారు రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి, వర్ల రామయ్య, ఎస్ ఏ షరీఫ్ వంటి నేతలు ఈ సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!