
గాసిప్స్

హైదరాబాద్లో ఇండిగో విమానాల రద్దు తీవ్రంగా పెరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సిన 54 ఇండిగో విమానాలు రద్దు కాగా, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన 61 విమానాలు కూడా రద్దయ్యాయి. మొత్తం కలిపి 115 విమానాలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సిబ్బంది సమస్యలు, సాంకేతిక లోపాలు, ఆపరేషనల్ అంతరాయాలే ఈ భారీ రద్దులకు కారణమని ప్రాథమిక సమాచారం. ఇప్పటికే టెర్మినల్లో ప్రయాణికుల రద్దీ పెరిగి, అనేక మంది గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండిగో అధికారులు పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి వస్తుందని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!