
సినిమాలు

త్వరలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నోటీసులు జారీ కావచ్చని తెలుస్తోంది.
అప్పటి ప్రభుత్వ పెద్దలైన కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్‌ల కోసం ఫోన్ ట్యాపింగ్ నిర్వహించినట్లు ప్రభాకర్‌రావు వెల్లడించినట్టు సమాచారం. అలాగే, ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీతో కలిసి హరీష్‌రావు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు గుర్తించినట్లు సిట్ పేర్కొంది. ఇదే విధంగా, కొంతమంది వ్యక్తులపై కేటీఆర్ సూచనలతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.


.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!