

GHMC వార్డుల సంఖ్యను 300 కి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డులు ఉన్నప్పటికీ, మంగళవారం విడుదల చేసిన గెజిట్ ప్రకారం వాటిని 300 కు పెంచింది. ఇటీవలి కాలంలో నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో, కమిషనర్ సమర్పించిన వార్డు రీఆర్గనైజేషన్ స్టడీ రిపోర్టును పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా విలీనం చేసిన అర్బన్ లోకల్ బాడీల డేటాను ఆధారంగా తీసుకుని ప్రభుత్వం వార్డుల సంఖ్యను ఖరారు చేసింది.
ఈ అధ్యయనం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ అంశాలను పరిగణనలోకి తీసుకుని GHMC చట్టం 1955 లోని సెక్షన్ 8 మరియు సెక్షన్ 5 ప్రకారం కొత్త వార్డులను నిర్ణయించారు. గెజిట్కు సంబంధించిన 500 ప్రతులను ముద్రణ శాఖ కు అందించాలని సూచించారు. జీహెచ్ఎంసీ వార్డు పునర్విభజన రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది. గెజిట్ విడుదల అనంతరం వారం రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!