

మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున నుంచే ఆలయాల వద్ద క్యూలైన్లలో భక్తులు నిలబడి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగగా, భక్తులు రాత్రంతా జాగరణలు చేసి శివారాధనలో పాల్గొన్నారు.
తెలంగాణలో వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆదిశ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. సాయంత్రం నందివాహన సేవ, రాత్రి రుద్రాభిషేకం, అర్ధరాత్రి పార్వతీ–పరమేశ్వరుల కల్యాణం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు బిందె తీర్థంతో తొలి అభిషేకం నిర్వహించగా, అర్ధరాత్రి నుంచే భారీగా భక్తులు క్యూలైన్లలో నిలబడి ప్రత్యేక అలంకరణలో శివయ్య దర్శనం పొందుతున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!