

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N.చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై సిపిఐ నేత C. నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకు తమిళనాడులో రాజకీయంగా ప్రతికూల పరిస్థితి తప్పదని వ్యాఖ్యానించారు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాలనలో తెలుగు భాష పాఠశాలలను మూసివేయాలన్న తీర్మానం వచ్చినప్పుడు, తమిళనాడులోని తెలుగు ప్రజల తరఫున చంద్రబాబు స్పందించలేదని నారాయణ ఆరోపించారు. అప్పట్లో తెలుగు ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడం సబబు కాదని విమర్శించారు. అలాగే తెలుగు పాఠశాలల మూసివేతను అప్పటి ఎమ్మెల్యే రామచంద్రన్ వ్యతిరేకించి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారని గుర్తు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!