
క్రీడలు

ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను దూషిస్తూ, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఆ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అనుచితమైన పోస్టులు చేస్తున్నారని లావణ్య త్రిపాఠి ఆరోపించారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!