
గాసిప్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపాకుల వెంకటయ్య, వార్డ్ సభ్యులు, గ్రామ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో సర్పంచ్‌గా వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్యతో పాటు వార్డ్ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. గ్రామ అభివృద్ధికి కలిసి పనిచేయాలని సూచించారు. కొండారెడ్డిపల్లి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!