

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మాణం పూర్తికి చేరుకుని త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు వరుసలుగా నిర్మించిన ఈ రహదారిలో సీసీ కెమెరాలు, సోలార్ ఆధారిత దీపాలు, క్యూఆర్ కోడ్ సమాచార వ్యవస్థ, ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్స్, ఆధునిక ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ వంటి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవేగా నిలవనుండగా, మే నెలలో ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది.
భారతమాల పరియోజన కింద రూ.4,451.87 కోట్ల వ్యయంతో నిర్మించిన 162.04 కిలోమీటర్ల ఈ హైవే ద్వారా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణ దూరం సుమారు 56 కిలోమీటర్లు తగ్గనుంది. పరిమిత ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, ప్రయాణించిన దూరానికే టోల్ వసూళ్లు, ప్రమాదాల నివారణకు ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు ఈ రహదారి ప్రత్యేకతలు. ప్రతి 50 కిలోమీటర్లకు విశ్రాంతి కేంద్రాలు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్తో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా సమీప సేవల సమాచారం అందే విధంగా సదుపాయాలు కల్పించారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!