

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలపై గతంలో జరిగిన దాడులకు ఆయన క్షమాపణలు ప్రకటించారు. ఇకపై సమీప దేశాలపై ఎలాంటి దాడులు జరగవద్దని స్పష్టంగా తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “మీరు మా జోలికి రాకుంటే, మేము మీ జోలికి రాము” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ కు మేం లొంగే ప్రసక్తే లేదు. వారిని ఎల్లప్పుడూ ఎదుర్కోవాలని చెప్పారు.
అదేవిధంగా, ఇతర దేశాలను అమెరికా స్థావరాలుగా మార్చరాదు, వాటి ఆధారంగా అమెరికా పై దాడులు జరగకూడదని సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిదాడులుగా చర్యలు చేపట్టింది. దుబాయి, కువైట్, బహ్రెయిన్, యుఎఈతో పాటు గల్ఫ్ ప్రాంతంలోని ఇతర USA స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది.
ఇవి ఆగకుండా, ఆ దేశాలలోని ఆయిల్ రిఫైనరీలు, విమానాశ్రయాలపై మిస్సైళ్లు విరుచుకుపడ్డాయి. ఈ చర్యలపై గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ప్రజలకు, గల్ఫ్ దేశాలకి క్షమాపణలు ప్రకటిస్తూ సమస్యను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!