

ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన సైయారా సినిమా ప్రమోషన్ విధానం బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ప్రశంసలు అందుకుంది. సాధారణంగా సినిమాల విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కానీ ఈ చిత్రానికి మాత్రం దర్శకుడు నో-హైప్ స్ట్రాటజీని అనుసరించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాతో అహాన్ పాండే, అనీత్ పడ్డా కొత్తగా పరిచయమయ్యారు. అయినప్పటికీ వారిని మీడియా, ఈవెంట్లకు దూరంగా ఉంచి, వారి పాత్రలే తెర పై మాట్లాడేలా దర్శకుడు ప్లాన్ చేశారు.
ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్, ఈ విధానాన్ని దర్శకుడి అత్యుత్తమ నిర్ణయంగా అభినందించినట్లు మోహిత్ సూరి తెలిపారు. అదనంగా, పీఆర్ కార్యక్రమాల పై ఖర్చు చేయకుండా, సంగీతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం పై దృష్టి పెట్టడం కూడా ఆయన మెచ్చుకున్నారు. సినిమా పాటలు మంచి ఆదరణ పొందడంతో, పెద్ద అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 570 కోట్ల వసూళ్లు సాధించి విజయాన్ని నమోదు చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!