

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ (AP Legal Services Authority) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా హైకోర్టు జడ్జి జస్టిస్ సిహెచ్. మానవేంద్రనాథ్ రాయ్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గుజరాత్ హైకోర్టు నుండి బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, ప్రస్తుతం హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్నారు. సాంప్రదాయంగా, ఎక్కువ సీనియారిటీ కలిగిన జడ్జిని లీగల్ సెల్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమించడం జరుగుతోంది. ఆ పద్ధతినే కొనసాగిస్తూ ప్రభుత్వం ఆయనను నియమించింది.
ఇప్పటి వరకు ఈ పదవిలో జస్టిస్ రవినాథ్ తిల్హారీ బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీకాలం ముగియడంతో, కొత్తగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకంతో లీగల్ సర్వీసెస్ అథారిటీకి కొత్త ఉత్సాహం రానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!