

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతాయనే భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గవని, పనుల స్వభావంలో మాత్రమే మార్పులు వస్తాయని పేర్కొన్నారు. దేశీయంగా ఉద్యోగాలపై ఏఐ ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళన తనకు లేదని తెలిపారు.
2000లో వై2కే సమయంలో భారత్కు వచ్చిన అవకాశాల మాదిరిగానే, కొత్త టెక్నాలజీలు ఇప్పుడు కూడా కంపెనీలకు విస్తృత వ్యాపార అవకాశాలు తీసుకువస్తాయని మంత్రి చెప్పారు. 315 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ రంగం, సుమారు 60 లక్షల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్దీ నైపుణ్యం గల మానవ వనరుల అవసరం మరింత పెరిగి, ఎగుమతులు పెరగడంతో పాటు 23 లక్షలకు పైగా స్టెమ్ గ్రాడ్యుయేట్లకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!