
గాసిప్స్

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా భారీ దాడులు జరిపి దేశానికి తీవ్ర ఎదురుదెబ్బ ఇచ్చాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ, ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్‌రెజా సులేమానీ మృతి చెందినట్లు సమాచారం. అత్యున్నత సైనికాధికారులు నివసించే కీలక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ అధికారికంగా ప్రకటించారు.
ఈ దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచడం ద్వారా ప్రజలకు స్వేచ్ఛను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. అలీ లారిజానీ, సులేమానీని హతమార్చినట్లు ప్రకటిస్తూ, వారిని ఇరాన్ నాయకత్వానికి కీలక సహాయకులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!